AP Employees Protest on PRC: ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. ఇప్పటికే నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. రేపు సీఎస్‌కు సమ్మె నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. నేడు భేటీకానున్న ఉద్యోగసంఘాల నేతలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు.
AP Employees Protest: ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం... నేడు కలెక్టరేట్ల ముట్టడి
AP Employees Protest on PRC: పీఆర్సీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. ఇప్పటికే నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు... నేడు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి ఫ్యాప్టో పిలుపునిచ్చింది.
ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం
ఇప్పటికే నిరసనలు హోరెత్తిస్తున్న ఉపాధ్యాయులు ఫ్యాఫ్టో పిలుపు మేరకు నేడు కలెక్టరేట్లు ముట్టడించనుండగా జాక్టో డివిజన్ కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. సచివాలయ ఉగ్యోగులు భోజన విరామ సమయంలో ఆందోళన చేయనున్నారు.
ఇదీ చదవండి:cm kcr on employees: పరస్పర బదిలీలకు సీఎం అంగీకారం.. నేడు ఉత్తర్వుల జారీ