తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం సహాయ నిధికి రూ.10 లక్షల విరాళం - ముఖ్యమంత్రి సహాయ నిధి

వరద బాధితులను ఆదుకునేందుకు అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ ముఖ్యమంత్రి సహాయ నిధికి పది లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్​ను కలిసి చెక్కును అందచేశారు.

ivf president srinivas 10 lack rupees donate to cm relief fund
సీఎం సహాయ నిధికి రూ.10 లక్షల విరాళమిచ్చన ఉప్పల శ్రీనివాస్

By

Published : Oct 22, 2020, 6:08 PM IST

భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన వారని ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ ముఖ్యమంత్రి సహాయ నిధికి పది లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్​ను కలిసి చెక్కును అందచేశారు.

ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 550 కోట్ల రూపాయలు విడుదల చేయడం గొప్ప విషయమని.. ఆ స్ఫూర్తితో తన వంతు బాధ్యతగా పది లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు ఉప్పల శ్రీనివాస్ తెలిపారు.

ఇదీ చదవండిఃవరద నష్టం పరిశీలనకు కేంద్ర బృందం రాక

ABOUT THE AUTHOR

...view details