తెలంగాణ

telangana

ETV Bharat / state

గురువులు చెప్పిన సలహాలన్నీ పాటిస్తే బాగుండేది: రోశయ్య - BCCI Senior Selection Committee chaimen mskPrasad

గుంటూరు హిందూ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం హైదరాబాద్​ విశ్వేశ్వరయ్య భవనంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల పూర్వ విద్యార్థులైన... తమిళనాడు మాజీ గవర్నర్​ రోశయ్య,​హెచ్​సీయూ వీసీ అప్పారావు ముఖ్య అతిథిలుగా పాల్గొని తమ జ్ఞాపకాలను మిత్రులతో పంచుకున్నారు.

గురువులు చెప్పిన సలహాలన్ని పాటిస్తే బాగుండేది:రోశయ్య

By

Published : Aug 4, 2019, 9:06 PM IST

Updated : Aug 4, 2019, 9:30 PM IST

హైదరాబాద్ ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్​లో గుంటూరు హిందూ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ కొనిజేటి రోశయ్య, సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావుతోపాటు పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొని చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తమ కళాశాలలో సినీ దర్శకుడు కే.విశ్వనాథ్, బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ఎమ్మెస్కే ప్రసాద్, మాజీ గవర్నర్ రోశయ్య, పలువురు రాజకీయ ప్రముఖులు చదువుకున్నారని గుంటూరు పూర్వ విద్యార్థుల సంఘం తెలిపింది. గురువులు చెప్పిన సలహాలు, సూచనలు కొన్ని మాత్రమే అమలు చేశానని... పూర్తిగా అమలు చేస్తే బాగుండేదని రోశయ్య అన్నారు.

గురువులు చెప్పిన సలహాలన్ని పాటిస్తే బాగుండేది:రోశయ్య
Last Updated : Aug 4, 2019, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details