తెలంగాణ

telangana

ETV Bharat / state

Rain Alert: రాష్ట్రంలో రాగల 3 రోజులపాటు వర్షాలు - వర్షాలు

రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Rain
వర్షం

By

Published : Jul 18, 2021, 4:36 PM IST

మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇటు దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ఉపరితల ద్రోణులతో రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వెల్లడించింది.

గంటకు 30-40కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఈనెల 21న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం తెలిపింది. గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయని పేర్కొంది.

ఇదీ చదవండి:బిడ్డ కోసం చిరుతతో మహిళ ఫైట్​!

ABOUT THE AUTHOR

...view details