తెలంగాణ ప్రజలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా నాయకులు తెలంగాణను అవమానిస్తుంటే అధికార తెరాస మౌనంగా ఉండడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో తెలంగాణ ఇవ్వడం తప్పు అన్నట్లు కాషాయ నేతలు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇవ్వడం భాజపాకు ఇష్టం లేదన్నట్లుగా ఉందని దుయ్యబట్టారు.
తెలంగాణ ఏర్పడటం భాజపాకు ఇష్టం లేదా? ఉత్తమ్ - భారతీయ జనతా పార్టీ
తెలంగాణ ప్రజలను భారతీయ జనతా పార్టీ నేతలు అవమానించారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం భాజపా నేతలకు ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని స్పష్టం చేశారు.
తెలంగాణా ప్రజానీకాన్ని అమిత్ షా అవమానించారు : ఉత్తమ్
ఏ బిల్లు ఆమోదానికైనా పార్లమెంట్ తలుపులు మూస్తారా అని తెలంగాణా ప్రజానీకాన్ని అమిత్ షా అవమానించారని మండిపడ్డారు. ఈ నెల 20న రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి : పూర్తి స్థాయి బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు