తెలంగాణ

telangana

ETV Bharat / state

అంతరిక్ష పెట్టుబడుల కోసం సమగ్ర పాలసీ: జయేశ్‌ రంజన్‌ - అంతరిక్ష పెట్టుబడుల సమగ్ర పాలసీపై దృశ్యమాధ్యమ సమావేశం

రాష్ట్రంలో పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి కోసం అంతరిక్ష పెట్టుబడుల సమగ్ర పాలసీని రూపొందిస్తున్నామని ఐటీశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. ప్రపంచలోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ స్పేస్‌టెక్ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ రూపకల్పన కోసం వాటాదారులతో దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు.

IT secretary jayesh ranjan virtual meeting on space tech policy frame work today
వాటాదారులతో వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్న ఐటీశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్

By

Published : Feb 21, 2021, 8:39 PM IST

అంతరిక్ష సంబంధిత పెట్టుబడులు, ఆవిష్కరణలలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తెలంగాణ స్పేస్‌టెక్ పాలసీ సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌-2021ను రూపొందిస్తున్నామని ఐటీశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్ తెలిపారు. రాష్ట్రంలో ఎండ్-టు-ఎండ్ స్పేస్‌టెక్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు.

ఇది యూనివర్సల్ కనెక్టివిటీ, వ్యవసాయం, రిమోట్ ఎడ్యుకేషన్, విపత్తు నిర్వహణ కోసం పెద్ద డేటా అనలిటిక్స్ ఆవిష్కరణ, ఇతర రంగాలపై ప్రభావాన్ని చూపుతుందన్నారు. తెలంగాణ స్పేస్‌టెక్ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంబంధిత వాటాదారులందరితో వర్చువల్ వేదికగా సమావేశం నిర్వహించారు. వాటాదారుల సంప్రదింపుల సమావేశంలో హార్డ్‌వేర్ స్టార్టప్‌లు, అనలిటిక్స్ స్టార్టప్‌లు, అకాడమియా అంశాలపై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఇస్రో ప్రధాన కార్యాలయ కార్యదర్శి ఉమా మహేశ్వరన్, జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్‌ పాల్గొన్నారు.

ఇదీ చూడండి :మంత్రి నిరంజన్​రెడ్డిని అడ్డుకున్న భాజపా కార్యకర్తలు

ABOUT THE AUTHOR

...view details