కీలక వ్యవసాయ రంగంలో కృతిమ మేథ, డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం, బిగ్ డేటా, అంతరిక్ష పరిజ్ఞానం వంటి సేవలు అందిపుచ్చుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వరి పరిశోధన కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
'వ్యవసాయ రంగంలో వాటి సేవలు ఉపయోగించుకోవాలి' ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్దన్‌రెడ్డి, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్‌కుమార్, పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్. జగదీశ్వర్, హైదరాబాద్ భూసారం సంరక్షణ సంఘం ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి, కో- ఛైర్మన్ సదాశివరావు, కార్యదర్శి మనోజ్‌కుమార్, ఇతర అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
'వ్యవసాయ రంగంలో వాటి సేవలు ఉపయోగించుకోవాలి' ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో...
తెలంగాణ ఐటీఈసీ శాఖ, వరల్డ్ ఎకనమిక్ ఫోరం సంయుక్త సహకారంతో పీజేటీఎస్‌ఏయూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా వర్సిటీ పరిధిలోని జగిత్యాల, పాలెం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు, తాండూరు కంది పరిశోధన కేంద్రం, రాజేంద్రనగర్ వరి పరిశోధన కేంద్రంలో "ఎవాల్యూషన్ డ్రోన్ టెక్నాలజీ" నెట్‌వర్క్ ప్రాజెక్టు అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో సత్వర సేవలు అందించడం, వ్యవసాయ పంటల సాగులో పెట్టుబడి వ్యయం తగ్గించడం, నాణ్యమైన అధిక దిగుబడులు సాధించానేది ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రయోగాలను జయేశ్‌రంజన్, జనార్దన్‌రెడ్డి పరిశీలించారు.
ఐదు రకాల పంటలపై ప్రయోగాలు...
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఐదు రకాల పంటలపై ఈ ప్రయోగాలు చేస్తున్నామని వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావు వివరించారు. డ్రోన్ టెక్నాలజీ వినియోగానికి సంబంధించిన అనేక సాంకేతిక అంశాలు తెలియజేశారు. అనంతరం... సాయిల్ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని విదేశీ విద్యార్థుల అతిధి గృహంలో జనార్దన్‌రెడ్డి మొక్కలు నాటారు.
ఇదీ చూడండి: హెల్త్ బులెటిన్: ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమం