తెలంగాణ

telangana

ETV Bharat / state

వంశీరాం బిల్డర్స్‌పై ముగిసిన ఐటీ దాడులు - IT raids on Vamsiram Builders latest news

IT Raids at Vamshiram Builders : వంశీరాం బిల్డర్స్‌పై ఐటీ సోదాలు ముగిశాయి. మూడు రోజుల పాటు హైదరాబాద్, విజయవాడలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీగా బంగారం పట్టుబడిందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న పత్రాలు, బంగారం, నగదులపై వాంగ్మూలం ఇవ్వాలని త్వరలోనే సమన్లు జారీ చేయనున్నారు.

IT raids on Vamsiram Builders
IT raids on Vamsiram Builders

By

Published : Dec 9, 2022, 11:17 AM IST

IT Raids at Vamshiram Builders : వంశీరాం బిల్డర్స్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు ముగిశాయి. మూడు రోజులుగా హైదరాబాద్, విజయవాడలో 25 ఐటీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. వంశీరాం బిల్డర్స్ అధినేత ఇల్లు, సీఈఓ, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించినప్పుడు బంగార ఆభరణాలు, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన రికార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని లాకర్లను తెరిచిన ఐటీ అధికారులు... అందులోనూ విలువైన పత్రాలు, బంగారం ఉన్నట్లు గుర్తించారు.

ఐటీ సోదాల్లో భారీగా బంగారం పట్టుబడిందని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారులు ధ్రువీకరించడం లేదు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న పత్రాలు, బంగారం, నగదులపై వాంగ్మూలం ఇవ్వాలని త్వరలోనే సమన్లు జారీ చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details