సినీ, స్థిరాస్తి రంగాలకు చెందిన సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్‌కు సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు జరిపారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో సహా చెన్నైలో ఉంటున్న దగ్గుబాటి కుటుంబ సభ్యుల నివాసాల్లోనూ ఏకకాలంలో దాడులు జరిపారు. సురేశ్ ప్రొడక్షన్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న పత్రాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.
రాజకీయ, సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు - IT RAIDS on Kukatpally Mla Madavaram Krishna rao house
ఐటీ అధికారులు బుధవారం ఒక్కసారిగా సినీ తారల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, సురేశ్ ప్రొడక్షన్‌కు సంబంధించిన కార్యాలయాలు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నివాసంలో ఐటీ అధికారుల సోదాలు చేశారు.

రాజకీయ, సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు
సినీ నటుడు నాని కార్యాలయంలోనూ ఐటీశాఖ అధికారులు సోదాలు జరిపారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటిపైనా ఐటీ దాడులు నిర్వహించారు. ఆయన కుమారుడు సందీప్‌రావు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ప్రణీత్ హోమ్స్ సంబంధింత వ్యక్తులు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి.
రాజకీయ, సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు
ఇదీ చూడండి: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే పొడిగింపు