హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో పలు అవకతవకలను గుర్తించినట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఎంఎస్‌ఎన్, దాని అనుబంధ సంస్థలు, ఫార్మా సంస్థకు రసాయనాలు, ముడి పదార్థాలు సరఫరా చేసిన కంపెనీలకు చెందిన పత్రాలను ఐటీ బృందాలు పరిశీలించాయి. ఆదాయపు పన్ను చెల్లింపులో వ్యత్యాసం, ముడి పదార్థాల కొనుగోళ్లు, ఉత్పత్తులు తదితర వాటికి సరైన లెక్కలు చూపడం లేదన్న ఆధారాలతో సోదాలు జరగగా.. వాటికి సంబంధించిన బిల్లులను నిశితంగా పరిశీలించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఎంఎస్‌ఎన్‌లో ముగిసిన సోదాలు.. పలు పత్రాలు స్వాధీనం - తెలంగాణ వార్తలు
నగరంలోని ఎంఎస్‌ఎన్ ల్యాబొరేటరీలో సోదాలు ముగిసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. దాడుల్లో పలు అవకతవకలను గుర్తించినట్లు చెప్పారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
ఎంఎస్‌ఎన్‌పై ఐటీ దాడులు
సరైన వివరణ లేని పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ సీనియర్ అధికారి తెలిపారు. రూ. వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థ కావడంతో స్వాధీనం చేసుకున్న వాటిని నిశితంగా పరిశీలించిన తర్వాతనే.. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసం, అవకతవకలు ఏ మేరకు ఉన్నాయనేవి వెలుగులోకి వస్తాయని వెల్లడించారు.