ఫార్మారంగ సంస్థ దివీస్ లాబోరేటరిస్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ప్రముఖ ఫార్మారంగ సంస్థ దివీస్ లాబోరేటరిస్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ సంస్థ పది కార్యాలయాలపై ఏక కాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలోని కార్పొరేట్ కార్యాలయంతో పాటు సనత్‌నగర్‌లోని పరిశోధన విభాగం, నగరశివారుకి సమీపంలోని చౌటుప్పల్, విశాఖపట్నంలోని సంస్థ కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
ఏటా ఐటి అధికారులకు పూర్తి వివరాలు సమర్పిస్తున్నామని దివీస్ యాజమాన్యం తెలిపింది. ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి అధికారులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలకు పూర్తి వివరాలు సమర్పిస్తామని సంస్థ అధికారులు స్పష్టం చేశారు.