తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగు రాష్ట్రాలలో ఐటీ సోదాలు కలకలం.. పలు దస్త్రాలు స్వాధీనం..!

IT Raids in Telugu States Today: స్థిరాస్థి వ్యాపారి వంశీరామ్‌ బిల్డర్స్‌పై ఐటీ సోదాలు ఇవాళ కూడా కొనసాగాయి. ఇవాళ పలు రికార్డులు స్వాధీనం చేసుకున్న అధికారులు కొన్ని బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేశారు. ఈ రాత్రికి సోదాలు ముగిసినా.. మిగతా లాకర్ల ఓపెన్ రేపు జరిగే అవకాశముంది. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న రికార్డులు పరిశీలించాకే వంశీరామ్ బిల్డర్స్ ఎంత మేర పన్ను ఎగవేశారనే విషయంలో స్పష్టత వస్తుందని ఐటీ అధికారులు తెలిపారు.

IT Raids in Telugu States Today
IT Raids in Telugu States Today

By

Published : Dec 7, 2022, 10:17 PM IST

IT Raids in Telugu States Today: స్థిరాస్థి వ్యాపారి వంశీరామ్‌ బిల్డర్స్‌పై రెండు రోజులుగా కొనసాగిన ఐటీ సోదాల్లో పెద్ద ఎత్తున దస్త్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌, విజయవాడల్లోని పలు ప్రాంతాల్లో నిన్న, ఇవాళ తనిఖీలు నిర్వహించారు. నిన్న హైదరాబాద్‌లో 15, విజయవాడలో మరో పది లెక్కన 25 ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఇవాళ ఉదయానికి కొన్నిచోట్ల తనిఖీలు ముగిశాయి.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు మరికొన్ని చోట్ల ఇవాళ కూడా పూర్తి స్థాయిలో సోదాలు కొనసాగాయి. ఈ రాత్రికి తనిఖీలు ముగిసే అవకాశం ఉన్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్క్‌లు, పెన్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్లు, సీపీయులు స్వాధీనం చేసుకున్న ఐటీ బృందాలు వాటిని ఐటీ కార్యాలయానికి తరలించాయి. బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్లు గుర్తించి కొన్ని లాకర్లను ఇవాళ తెరచిన ఐటీ అధికారులు మరికొన్నింటిని రేపు, ఎల్లుండి తెరచే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఈ సంస్థ నిర్వహిస్తున్న వ్యాపారానికి, అది చెల్లిస్తున్న ఆదాయపన్నుల మధ్య వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించి సోదాలు నిర్వహించిన ఐటీ శాఖ పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలకు చెందిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు పేర్కొన్నాయి. స్వాధీనం చేసుకున్న వాటిని పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తరువాత... ఎంత మొత్తంలో వ్యాపార లావాదేవీలు జరిగాయి, అందుకుగాను చెల్లించాల్సిన ఆదాయపు పన్ను ఎంత అన్నది అంచనాలు వేయాల్సి ఉందని వివరించాయి.

గతంలో కూడా ఈ వంశీరామ్‌ బిల్డర్స్‌ సంస్థపై ఐటీ సోదాలు కొనసాగాయి. అప్పట్లో పెద్దగా వ్యత్యాసాలు లేవని తేల్చిన అధికారులు... ఈసారి భారీ ఎత్తున ఉండే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సోదాలు ముగిసిన వెంటనే ఈ సంస్థకు చెందిన ఎండీతో పాటు డైరెక్టర్లకు, ఇందులో భాగస్వామ్యం కలిగిన వాళ్లకు, పెట్టుబడిదారులకు సమన్లు జారీ చేసి కార్యాలయానికి పిలిపించి వారి స్టేట్‌మెంట్లు తీసుకుంటారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details