IT Raids in Hyderabad Today: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు అలజడి రేపుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఐటీ శాఖ సోదాలు నెల రోజుల నుంచి ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా దాడులు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని వంశీరామ్ బిల్డర్స్ ఎండీ సుబ్బారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్‌లో నివాసం ఉంటున్న ఎండీ సుబ్బారెడ్డి ఇంట్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
IT Raids in Telugu states today : హైదరాబాద్, విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో 20కిపైగా ఐటీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆదాయపు పన్ను చెల్లింపులో తేడాలున్నట్లు గుర్తించిన అధికారులు.. తెల్లవారుజాము నుంచే హైదరాబాద్, విజయవాడ, నెల్లూరులో గల కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్లను పరిశీలించారు. ఆదాయపు పన్ను చెల్లించే విషయంలో భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుణదలలోని ఆయన నివాసంలో ఉదయం 6.30 గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ భూమి వ్యవహారంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థకు సంబంధించి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వంశీరాం బిల్డర్స్ సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు యజమాని, డైరెక్టర్ గృహాల్లో, సీఈఓలతో ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారి ఇళ్లల్లో సోదాలు చేస్తున్నట్లు ఐటీ అధికారులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్‌లో 15 బృందాలు జూబ్లీహిల్స్ ప్రధాన కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తుండగా, విజయవాడలోనూ అధికారులు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను విశ్లేషిస్తున్నారు. ఈ సోదాలు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరొకవైపు వంశీరామ్ బిల్డర్స్‌పై ఐటీ సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతుండడంతో ఆ సంస్థ... అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: