IT Raids in Hyderabad Today :హైదరాబాద్‌లో మరోసారి పలు చోట్ల ఐటీ సోదాలుకలకలం రేపుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామునే బృందాలుగా విడిపోయి ఐటీ కార్యాలయం నుంచి బయలుదేరిన అధికారులు.. పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. కూకట్పల్లిలోని హిందూ ఫార్చ్యూన్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వ్యాపార లావాదేవీల్లో ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి ఈ సోదాలు సాగిస్తున్నారు.
IT Raids in Hyderabad : హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాల కలకలం
IT Raids in Hyderabad : హైదరాబాద్ మరోమారు ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి. పలు చిట్ ఫడ్ కంపెనీలకు సంబంధించిన యజమానుల ఇల్లు కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Published : Oct 5, 2023, 10:03 AM IST
|Updated : Oct 5, 2023, 11:35 AM IST
నగరంలోని పూజాకృష్ణ చిట్ ఫండ్ కార్యాలయం, ఇంట్లో కలిపి 40 మంది అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదేవిధంగా పలు చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించిన యజమానుల ఇల్లు కార్యాలయాలతో పాటు స్థిరాస్తి సంస్థల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 100 బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సోదాల్లో భాగంగా దస్త్రాలు, బ్యాంకు ఖాతాలు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు పరిశీలిస్తున్నారు. విల్లా 23 ఆరెకపూడి కోటేశ్వరరావు, విల్లా 50 అవిర్నేని వర ప్రసాద్ ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. చిట్ ఫండ్ కంపెనీలో అవకతవకలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
IT Raids in Hyderabad : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో మూడో రోజూ ఐటీ సోదాలు