IT Raids Continues Second Day in BRS MLAs house :రాష్ట్రంలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సుమారు 70బృందాలతో... స్థిరాస్తి, హోటల్స్ వ్యాపారంలో భాగస్వామ్యం కలిగిన వారి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి ఇళ్లలో... రెండోరోజు ఆదాయపన్ను శాఖ సోదాలు చేస్తున్నారు. జూబ్సీహిల్స్‌లోని మర్రి జనార్దన్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లిన ఐటీ అధికారులు... ఆదాయపన్ను చెల్లింపు, వ్యయాలపత్రాలను పరిశీలిస్తున్నారు. అమీర్‌పేట్‌లోని జేసీ బ్రదర్స్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. గడిచిన రెండు ఆర్ధిక సంవత్సరాల... వ్యాపార, ఆర్ధిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. స్ధిరాస్తి, హోటల్స్ వ్యాపారాల్లో... భాగస్వామ్యం అనుబంధ వ్యాపారాలు, బినామీలు, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈవో ఇళ్లలోను సోదాలు చేస్తున్నారు.
BRS MLA Marri Janardhan Reddy Reacts on IT Raids : ఐటీ దాడులపై స్పందించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి... బుధవారం నుంచి తనిఖీలు చేస్తున్నారని వెల్లడించారు. ఐటీ అధికారుల సోదాలకు పూర్తిగా సహకరిస్తున్నట్లు వివరించిన ఆయన... ఎమ్మెల్యేలు వ్యాపారం చేయొద్దని రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు. వ్యాపారానికి తగినంత పన్ను చెల్లిస్తున్నట్లు పునరుద్ఘాటించారు. సకాలంలో పన్ను చెల్లించాలని గతంలో ఐటీశాఖ అధికారులే అవార్డు ఇచ్చారన్న ఎమ్మెల్యే... ప్రస్తుతం అదేరీతిలో క్లీన్ చీట్ ఇచ్చి వెళ్తారని వెల్లడించారు.