IT Raids Completed on Ponguleti Srinivas Reddy House : పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఐటీ దాడులు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్‌లోని పొంగులేటి నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. రెండు బృందాలుగా(Two Teams) ఏర్పడి తనిఖీలు చేసిన అధికారులు.. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసంలో గురువారం సోదాలు చేసిన అధికారులు.. ఈరోజు కూడా కొనసాగించారు.
విస్తృతంగా తనిఖీలు చేయడంతో పాటు.. ఖమ్మం నుంచి హైదారాబాద్‌కు వచ్చిన పొంగులేటి కుటుంబసభ్యులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని కీలక పత్రాలు(Important Documents) స్వాధీనం చేసుకన్న ఐటీ అధికారులు.. సోదాలు ముగిశాక అక్కిడి నుంచి వెళ్లిపోయారు. అలాగే గురువారం జరిగిన ఐటీ సోదాల్లో పత్రాలు, డాక్యుమెంట్లకు సంబంధించి పొంగులేటికి ఐటీ అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ఖమ్మం నివాసంలో సోదాలు జరుగుతున్న సమయంలోనే.. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఆయన నివాసాలు, కార్యాలయాలపైనా ఐటీ దాడులు కొనసాగాయి.
పొంగులేటిపై "ఐ" టీ దాడులు- నివాసాలు, కార్యాలయాల్లో రోజంతా ఆదాయశాఖ సోదాలు
ఖమ్మం నగరంలోని పొంగులేటి కుటుంబీకులకు చెందిన ఇళ్లు, బంధువుల నివాసాలు , ఎస్ఆర్ కన్వెన్షన్, రాఘవా కన్స్ట్రక్షన్స్ కార్యాలయాలతోపాటు పొంగులేటి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలోని ఆయన ఇంటిలోనూ ఏకకాలంలో దాడులు(Simultaneous Attacks) జరిగాయి. ఎక్కడివారు అక్కడే కదలకుండా చేసి పటిష్ఠ బందోబస్తు విధించారు. పొంగులేటి నివాసంపై ఐటీ దాడులు జరుగుతున్నాయన్న సమాచారం తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు భారీగా పొంగులేటి ఇంటి వద్దకు చేరుకుని నిరసించారు.