తెలంగాణ

telangana

ETV Bharat / state

యాక్సిస్ ఎనర్జీ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు

యాక్సిస్ ఎనర్జీ కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్​లోని 20 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.

It officers Raids On Access Energy Group
యాక్సిస్ ఎనర్జీ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు

By

Published : Dec 11, 2020, 4:37 AM IST

సౌర విద్యుదుత్పత్తి సంస్థ యాక్సిస్ ఎనర్జీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్​లోని 20 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సాగిన తనిఖీల్లో కంప్యూటర్​ హార్డ్​ డిస్కులు, పెట్టుబడులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్​ సోమాజీగూడలోని ప్రధాన కార్యాలయంలో మొదలుపెట్టిన అధికారులు.. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని 20 చోట్ల నిర్వహించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో గుడిమల్కాపురం పరిధిలోని చెట్టినాడ్​ సిమెంట్​ పరిశ్రమలోనూ ఐటీ సోదాలు నిర్వహించారు. చెన్నైలో నమోదైన సీబీఐ కేసులో భాగంగా చెట్టినాడ్​ గ్రూప్​ ఆఫ్​ కంపెనీలపై దేశవ్యాప్తంగా పలుచోట్ల ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఐటీ బృందం పది గంటల పాటు సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పరిశ్రమ లావాదేవీలు, పలు పత్రాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం.

ఇదీ చూడండి: నేటి నుంచి రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details