IT NOTICES TO MINISTER GUMMANURU: ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆదాయపన్ను శాఖ నోటీసులు కలకలం రేపాయి. ఆ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆయన సతీమణి రేణుకకు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. మంత్రి జయరాం దంపతులతో పాటు ఆలూరు సబ్ రిజిస్ట్రార్‌కు కూడా నోటీసులు పంపింది. బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం ప్రకారం రాష్ట్ర మంత్రికి నోటీసులు జారీ అయ్యాయి.
30 ఎకరాల భూమి విషయంలో.. మంత్రి జయరాంకు ఐటీశాఖ నోటీసులు - IT NOTICES TO AP MINISTER
IT NOTICES TO MINISTER GUMMANURU: ఏపీ మంత్రి జయరాంకు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. మంత్రితో పాటు అతని భార్యకు కూడా నోటీసులు వచ్చాయి. రెండేళ్ల క్రితం భూమి కొనుగోలు విషయంలో తాజాగా ఐటీ శాఖ ఈ నోటీసులు పంపింది.
కార్మికశాఖ మంత్రి జయరాం
రెండేళ్ల క్రితం ఆస్పరిలో రేణుకమ్మ 30 ఎకరాల కొనుగోలుకు రూ.52 లక్షలు ఎలా వచ్చాయో తెలపాలని నోటీసులు పంపించారు. 90 రోజుల్లో సమాధానం చెప్పాలని అక్టోబర్ 30న నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయం స్పందించిన మంత్రి.. తమకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు.
ఇవీ చదవండి: