టౌన్షిప్ పాలసీతో భాగ్యనగరంపై తగ్గనున్న భారం: కేటీఆర్
హైదరాబాద్‌కు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. భాగ్యనగరంపై భారం తగ్గించేందుకు టౌన్షిప్ పాలసీ తీసుకొచ్చామని వెల్లడించారు. టౌన్షిప్లో ఉద్యోగం, నివాసం, విద్య, వైద్యం, వినోదం ఒకే దగ్గర ఉంటాయన్నారు. దీంతో బయటకు వచ్చే వారి సంఖ్య తగ్గి.. ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. ఫలితంగా నగరంపై భారం తగ్గుతుందని తెలిపారు. టౌన్‌షిప్‌లు ప్రణాళిక ప్రకారం నిర్మించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. మెట్రోను విమానాశ్రయం వరకు విస్తరించాలన్నారు. ఎంఎంటీఎస్‌ను కూడా విస్తరించాలని ఈటీవీ భారత్ ముఖాముఖిలో కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ శివారులో టౌన్‌షిప్‌లు: కేటీఆర్
Last Updated : Nov 21, 2020, 4:15 PM IST