తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌లో 500కు పైగా అమెరికా సంస్థలు రాణిస్తున్నాయి: కేటీఆర్ - కేటీఆర్ తాజా వ్యాఖ్యలు

KTR on Technology Companies in Hyderabad: హైదరాబాద్ కేంద్రంగా ప్రముఖ టెక్నాలజీ కంపెనీల రెండో అతిపెద్ద కేంద్రాలు ఏర్పాటవుతున్నయని ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో 500కు పైగా అమెరికా సంస్థలు రాణిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన స్టేట్‌ స్ట్రీట్‌ సంస్థ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగంలో రాణిస్తోందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ktr
ktr

By

Published : Feb 15, 2023, 10:13 PM IST

KTR on Technology Companies in Hyderabad: పెట్టుబడులకు స్వర్గధామంగా మారిన హైదరాబాద్​లో 500కు పైగా అమెరికా సంస్థలు రాణిస్తున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రముఖ టెక్నాలజీ కంపెనీల రెండో అతిపెద్ద కేంద్రాలు హైదరాబాద్​లో ఏర్పాటవుతున్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికే అమెజాన్ సంస్థ భాగ్యనగరంలో అతిపెద్ద కేంద్రం ఏర్పాటు చేసిందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరికొన్ని సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయన్నారు.

యాపిల్‌, గూగుల్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌ కేంద్రాలు హైదరాబాద్‌లో ఏర్పాటు అయ్యాయని ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన స్టేట్‌ స్ట్రీట్‌ సంస్థ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగంలో రాణిస్తోందని స్పష్టం చేశారు. 2018లో ప్రారంభమైన స్టేట్‌ స్ట్రీట్‌ సంస్థలో ప్రస్తుతం 9 వేల మంది ఉద్యోగులున్నారని వివరించారు. హైదరాబాద్‌ కౌన్సిల్‌ కార్యాలయం నుంచి భారీగా విద్యార్థి వీసాలు జారీ అవుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు.

గత నెల నగరంలోని వెబ్‌సర్వీసెస్ డేటా సెంటర్లలో అదనపు పెట్టుబడి పెట్టి విస్తరించేందుకు అమెజాన్‌ తీసుకున్న నిర్ణయంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్‌లో.. దావోస్ నుంచి వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న కేటీఆర్​.. అమెజాన్ అదనపు పెట్టుబడి, విస్తరణ ప్రణాళికలపై సంతోషం వ్యక్తంచేశారు. 2030 నాటికి.. రూ. 36,300 కోట్లు పెట్టుబడిగా పెడతామన్న అమెజాన్ నిర్ణయాన్ని కేటీఆర్​ స్వాగతించారు.

అమెజాన్ పెట్టుబడులతో తెలంగాణ డేటా సెంటర్ ప్రధాన కేంద్రంగా మారుతుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి, అమెజాన్ సంస్థకు మధ్య మంచి సంబంధాలున్నాయని ఆ సంస్థ విస్తరణకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తమ వినియోగదారులకు ఉత్తమ క్లౌడ్ సేవలను అందించేందుకు చందన్​పల్లి, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీలో మూడు డేటా సెంటర్లను.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ గుర్తు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details