తెలంగాణ

telangana

ETV Bharat / state

లైఫ్‌సైన్సెస్ రంగం విలువలు 2028 నాటికి రెట్టింపు: కేటీఆర్‌

KTR on Bio Asia Conference in Hyderabad: జీవశాస్త్ర రంగంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం... ఫార్మా సిటీ ఏర్పాటుతో మరింత ఎత్తుకు ఎదుగుతుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ జినోమ్‌వ్యాలీలో ఈనెల 24 నుంచి 26 వరకు జరగనున్న.. బయో ఆసియా సదస్సుపై కేటీఆర్‌ మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 బిలియన్ డాలర్లుగా ఉన్న లైఫ్‌సైన్సెస్ ఎకోసిస్టం విలువను 2028 నాటికి రెట్టింపు చేస్తామన్నారు.

KTR
KTR

By

Published : Feb 21, 2023, 6:39 PM IST

Updated : Feb 21, 2023, 7:04 PM IST

KTR on Bio Asia Conference in Hyderabad: హైదరాబాద్‌ జినోమ్‌ వ్యాలీలో ఈనెల 24 నుంచి 26 వరకు జరగనున్న.. బయో ఆసియా సదస్సుపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. జీవ శాస్త్ర రంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ ఫార్మా సిటీ ఏర్పాటు ద్వారా మరింత ఎత్తుకు ఎదుగుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బయో ఆసియా ప్రాముఖ్యతతో పాటు జీవశాస్త్ర, ఫార్మా రంగాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపట్టనున్న చర్యల గురించి వివరించారు.

19 సదస్సులు పూర్తి చేసుకుని ఈసారి ప్రతిష్టాత్మక ఈ 20వ సదస్సు ‘‘అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌ - షషేపిగ్ నెక్ట్స్ జనరేషన్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌’’ అన్న ఇతివృత్తంతో జరగనుందని కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో... 50 బిలియన్ డాలర్లుగా ఉన్న లైఫ్‌సైన్సెస్ ఎకోసిస్టం విలువను 2028 నాటికి రెట్టింపు చేస్తామన్నారు. ఉద్యోగాల సంఖ్య రెట్టింపు చేసి... 8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. బయో ఆసియా సదస్సులతో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. దేశ లైఫ్ సైన్సెస్ రంగానికి బయో ఆసియా విస్తృతమైన సేవలు అందించిందన్న కేటీఆర్.. లైఫ్ సైన్సెస్ రంగంలో అవకాశాలు ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ సదస్సు విజయం సాధించిందన్నారు.

'జినోమ్‌వ్యాలీలో ఈనెల 24 నుంచి 26 వరకు బయో ఆసియా సదస్సు. 2028 నాటికి లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం విలువ రెట్టింపు చేస్తాం. ఉపాధి అవకాశాలు రెట్టింపు చేసి 8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం. తొలిసారి యాపిల్‌ కంపెనీ సదస్సులో పాల్గొంటోంది. త్వరలో ఎంఆర్‌ఎన్‌ఏ టీకా కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు. 33 జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుతో ప్రజారోగ్య రంగాల బలోపేతం. హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదు. హైదరాబాద్ ఫార్మాసిటీకి అంతర్జాతీయ ప్రాధాన్యత ఉంది.'-కేటీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి

కేంద్రం నుంచి సాయం అందకున్నా రాష్ట్రం ముందుకు వెళ్తోంది: ఈ సదస్సులో తొలిసారి ఆపిల్‌ కంపెనీ పాల్గొంటోందని ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జీవ శాస్త్ర రంగంలో అపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మా సిటీ, మెడికల్ డివైసెస్ పార్క్, బయో ఆసియాతోపాటు అనేక ఇతర ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు వచ్చినా ఆదుకునే స్థాయిలో హైదరాబాద్‌ ఫార్మా సిటీ ఉంటుందని కేటీఆర్‌ వివరించారు.

ఫార్మాసిటీపై.. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫార్మా సిటీకి కేంద్రం నుంచి సాయం అందలేదని కేటీఆర్‌ ఆక్షేపించారు. కేంద్రం బల్క్ డ్రగ్ పార్క్ ఇవ్వకున్నా, ఫార్మా సిటీకి సాయం చేయకున్నా, ఐటీఐఆర్ రద్దుచేసినా... ఆయా రంగాల్లో రాష్ట్రం ముందుకు వెళ్తోందన్నారు. సరైన నాయకత్వం చిత్తశుద్ధి ఉంటే ఎన్ని అడ్డంకులనైనా దాటుకొని అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్రం నిరూపించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 21, 2023, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details