రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ.. అసిస్టెంట్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ టీఎస్‌పీఎస్సీ ఎదుట ధర్నా చేపట్టింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు.
టీఎస్‌పీఎస్సీలోనే ఖాళీలు ఉండటం దురదృష్టకరం: ఆర్.కృష్ణయ్య - R krishnaiah latest updates
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 93వేల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ టీఎస్‌పీఎస్సీ ఎదుట ధర్నా చేపట్టింది.
టీఎస్‌పీఎస్సీ
తెలంగాణలో ఖాళీగా ఉన్న లక్షా 93వేల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఉద్యోగాలు భర్తీ చేసే టీఎస్‌పీఎస్సీలోనే ఖాళీలు ఉండటం దురదృష్టకమన్నారు. తక్షణమే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌తో పాటు సభ్యులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. అసిస్టెంట్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్ ఫలితాలను వెంటనే ప్రకటించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులతో కలిసి టీఎస్‌పీఎస్సీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాజకీయ ప్రముఖుల ఆకాంక్ష