కోడి కోడిని పెట్టలేదుగా.. ఇప్పుడే ఏపీలో కోడి గుడ్డు పెట్టింది.. మంత్రిగారి గుడ్డు కహాని Amarnath egg story on E racing: హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ- కార్ రేస్ చూడటానికి దేశం నలువైపుల నుంచి రేసింగ్ అభిమానులు, సెలబ్రిటీలు వస్తున్నారు. ఈ సందర్భాంగా వారికి రేసింగ్‌పై ఉన్న ఇష్టాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం ఈ-కార్ రేస్ చూసేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన విలేఖర్లు అడిగిన ప్రశ్నకు విచిత్రమైన సమాధానం ఇచ్చారు.
"ఈ-కార్ రేస్" నిర్వహణ గర్వకారణమని.. పేర్కొన్న ఆయన.. తెలుగు ప్రజలంతా కలిసి నిర్మించిన హైదరాబాద్ నగరానికి.. ఈ రేస్ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు రావడం సంతోషంగా ఉందని" హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి రేసులు ఎప్పుడు నిర్వహిస్తారన్న ఓ ప్రశ్నకు మంత్రి విచిత్రమైన సమాధానమిచ్చారు.
"కోడి గుడ్డు పెట్టగలదు. కానీ, కోడి.. కోడిని పెట్టలేదుగా? కోడి గుడ్డు పెట్టాలి, పొదగాలి, పిల్లలు పెట్టాలి, పెరిగి పెద్దవ్వాలి. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో కోడి గుడ్డు పెట్టింది. పెట్ట కింద మార్చడానికి టైమ్ పడుతుందంటూ విచిత్రమైన పోలికతో జవాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించే స్థాయికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
"ఈ-కార్ రేస్" నిర్వహణ తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. తెలుగు ప్రజలంతా కలిసి నిర్మించిన హైదరాబాద్ నగరానికి... ఈ రేస్ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. కోడి గుడ్డు పెట్టగలదు. కానీ, కోడి.. కోడిని పెట్టలేదుగా? కోడి గుడ్డు పెట్టాలి, పొదగాలి, పిల్లలు పెట్టాలి, పెరిగి పెద్దవ్వాలి. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో కోడి గుడ్డు పెట్టింది. పెట్ట కింద మార్చడానికి టైమ్ పడుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించే స్థాయికి చేరుతుంది'- గుడివాడ అమర్నాథ్, మంత్రి
ఇవీ చదంవడి: