ఐటీగ్రిడ్ కేసులో క్వాష్ పిటీషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సంస్థ సీఈఓ అశోక్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోత్ర వాదనలు వినిపించారు. తెలంగాణ పోలీసులు అశోక్‌కు ఇచ్చిన నోటీసులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోరారు. ఇప్పుడు ఇవ్వలేమని సీఈఓ తరపు న్యాయవాది తెలిపారు. కేసు తదుపరి విచారణ ఈ నెల 20కి కోర్టు వాయిదా వేసింది.
ఐటీగ్రిడ్స్ కేసు 20కి వాయిదా - telangana police
ఐటీగ్రిడ్స్ కేసులో నేడు హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ పోలీసులకు ఈ కేసు దర్యాప్తు చేసే అధికారం లేదని అశోక్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు.

మీడియాతో మాట్లాడుతున్న అశోక్ తరపున న్యాయవాది