తెలంగాణ

telangana

ETV Bharat / state

సిట్​  ముందు హాజరుకానున్న ఐటీగ్రిడ్​ సీఈవో అశోక్​ - investigation

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చౌర్యం కేసులో హైకోర్టు నుంచి ముందస్తు బెయిలు పొందిన ఐటీ గ్రిడ్​ సీఈవో అశోక్​ నేడు సిట్​ అధికారుల ముందు హాజరుకానున్నారు.

సిట్​  ముందు హాజరుకానున్న గ్రిడ్​ సీఈవో అశోక్​

By

Published : Jun 20, 2019, 1:19 PM IST

Updated : Jun 20, 2019, 5:26 PM IST

ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్ నేడు సిట్ ముందు హాజరుకానున్నారు. డేటా చౌర్యం కేసులో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన అశోక్​ను పోలీస్ స్టేషన్​కు వెళ్లాల్సిందిగా నిబంధన విధించారు. ఆయన మాదాపూర్ పోలీస్ స్టేషన్​కు బుధవారం వెళ్లారు. ప్రస్తుతం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్నందున సిట్ అధికారులనే కలవాలని మాదాపూర్ పోలీసులు సూచించారు. ఈ రోజు గోషామహల్​లోని సిట్ కార్యాలయంలో అధికారుల ముందు అశోక్ హాజరుకానున్నారు. డేటా చౌర్యం కేసు సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారనే ఆరోపణలపై సైబరాబాద్ పోలీసులు పలు సెక్షన్ల కింద అశోక్​పై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి కీలక సమాచారం కూడా సేకరించారు. డేటా చౌర్యానికి గురైనట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదికలోనూ తేలింది.

సిట్​ ముందు హాజరుకానున్న గ్రిడ్​ సీఈవో అశోక్​
Last Updated : Jun 20, 2019, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details