తెలంగాణ

telangana

ETV Bharat / state

వాలంటరీలుగా ఐటీ ఉద్యోగులు.. వాహనదారులకు అవగాహన

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా నిర్విరామంగా పనిచేస్తున్న పోలీసులకు పలువురు ఐటీ ఉద్యోగులు ఆసరాగా నిలుస్తున్నారు. వారాంతాల్లో ముఖ్య కూడళ్లలో పోలీసులతో కలిసి విధులు నిర్వహిస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.

IT employees educating motorists on Corona
వాలంటరీలుగా ఐటీ ఉద్యోగులు.. వాహనదారులకు అవగాహన

By

Published : Apr 12, 2020, 11:50 AM IST

కరోనా వ్యాప్తి కట్టడి కోసం తమ వంతు బాధ్యతగా పలువురు ఐటీ ఉద్యోగులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇన్ఫోర్ గ్లోబల్ సొల్యూషన్ కంపెనీకి చెందిన ఐటీ ఉద్యోగులు... వనస్థలిపురంలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్​పోస్ట్​లో వాలంటరీలుగా పనిచేస్తున్నారు.

లాక్​డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి వారాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చెక్​పోస్ట్​ల వద్ద వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి రావొద్దని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి :వెళ్లలేరు.. ఉండలేరు..

ABOUT THE AUTHOR

...view details