తెలంగాణ

telangana

ETV Bharat / state

గేమింగ్ అడ్డాగా హైదరాబాద్​: జయేష్ రంజన్ - IT Department Principal Secretary Jayesh ranjan Started Game zone

యానిమేషన్, గేమింగ్ రంగంలో హైదరాబాద్ దూసుకెళుతోందని ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ పేర్కొన్నారు. నగరంలో ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు కొలువుదీరాయని... మరో కొత్త ఆవిష్కరణకు అడ్డాగా మారుతోందని తెలిపారు. మాదాపూర్​లో ఓ గేమింగ్​ సంస్థకు సంబంధించిన ఇమేజ్​ సెంటర్​ను ప్రారంభించారు.

IT Department Principal Secretary Jayesh ranjan Started Game zone in Madapur
గేమింగ్ అడ్డాగా హైదరాబాద్​: జయేష్ రంజన్

By

Published : Feb 17, 2020, 6:03 PM IST

హైదరాబాద్ మాదాపూర్ ఓ ప్రైవేట్​ హోటల్​లో సాఫ్ట్​వేర్ టెక్నాలజీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఇమేజ్ తొలి సెంటర్​ను ​రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి ప్రారంభించారు. గేమింగ్, వీఎఫ్ఎక్స్, ఏఐ, యానిమేషన్ రంగాల్లో చేయూత ఇవ్వడానికి ఈ సెంటర్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ సెంటర్ ద్వారా ప్రతి సంవత్సరం 30 అంకుర సంస్థలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఐదేళ్లలో మరిన్ని సదుపాయాల కల్పనకు 19కోట్ల 68 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అనంతరం జయేష్ రంజన్ సమక్షంలో పలు సంస్థలు ఏంఓయూలు కుదుర్చుకున్నారు.

గేమింగ్ అడ్డాగా హైదరాబాద్​: జయేష్ రంజన్

ఇదీ చదవండి:ఆ రైల్లోని 64వ సీటు శివుడికే శాశ్వతంగా కేటాయింపు!

ABOUT THE AUTHOR

...view details