కొలువులతో స్వాగతం పలుకుతున్న ఐటీ సంస్థలు - ఐటీ జాబ్స్ వార్తలు
ప్రస్తుతం.. ఎక్కడ చూసినా కరోనా పాజిటివ్ కేసుల గురించే తప్ప వేరే పాజిటివ్ అంశాల గురించి ఆలోచించలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఇటీవల డిగ్రీలు అందుకున్న యువతకు కొలువులతో స్వాగతం పలుకుతున్నాయి.. పలు ఐటీ సంస్థలు. నియామకాలతో ఉద్యోగార్థుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. ఇప్పటికే కొన్నికంపెనీలు ప్రాంగణ నియామకాలు ప్రారంభించగా.. మరికొన్ని ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఐటీ రంగంలో సుమారు 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ అవకాశాలను ఇంజినీరింగ్ విద్యార్థులు అందిపుచ్చుకోవడం ఎలా..? క్యాంపస్ దాటక ముందే ఉద్యోగం సాధించేందుకు ఎలాంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి...? అందుకు ఎలాంటి సన్నద్ధం అవసరం అనే విషయాలపై ప్రాంగణ నియామకాల శిక్షణ సంస్థ సన్ టెక్ కార్ప్ సీఈఓ వెంకట్ కాంచనపల్లితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఐటీ సంస్థలు