ఇంజినీరింగ్ గతినే కంప్యూటింగ్ మార్చి.. భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ఐఐబీ బిలాయ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రజత్ మోనె అన్నారు. హైదరాబాద్ శివారు రుద్రారం గీతం విశ్వవిద్యాలయంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇష్టమ్ 65వ అంతర్జాతీయ సదస్సును లాంఛనంగా ప్రారంభించి సావెనీర్ను విడుదల చేశారు. గీతంలోని గణితశాస్త్రం, మెకానికల్, ఇంజినీరింగ్ విభాగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల సదస్సుకు ఆయన హాజరయ్యారు.
ప్రొఫెసర్ రజిత్ మెకానిక్స్‌ను ఉపయోగించి అధిక పనితీరు గల కంప్యూటింగ్ అనే అంశంపై ప్రసగించారు. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఇష్టమ్ అధ్యక్షులు డాక్టర్ జీపీ రాజశేఖర్ దాని ఎదుగుదల ఎంపిక చేసిన లక్ష్యాలు, ఇష్టమ్ పాత్రల గురించి వివరించారు.