హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఇస్టా సదస్సు పురస్కరించుకొని విత్తన రైతు సమావేశానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ నాణ్యమైన విత్తనోత్పత్తికి అనుకూలమైందని పోచారం తెలిపారు. విత్తనోత్పత్తిదారుల కృషి ఫలితమే దేశీయంగా 65 శాతం అవసరాలు తీరుస్తున్నామన్నారు. 4.30 లక్షల ఎకరాల్లో 1.4 లక్షల మంది 64 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నారని వివరించారు. ఈ సదస్సు రాష్ట్ర రైతులను ప్రోత్సహించేలా ఉండాలని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లల్లో ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
రైతులకు అండగా ఉండేందుకే ఇస్టా సదస్సు
రైతులకు అండగా ఉండేందుకే ఇస్టా సదస్సు నిర్వహణకు ప్రభుత్వం చొరవ చూపిందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇది ఆషామాషీ సదస్సు కాదని పేర్కొన్నారు.
ఇస్టా సదస్సులో పోచారం