హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీ నోవాటెల్‌లో ఇష్టా కాంగ్రెస్-2019 నిర్వహించారు. ఎఫ్ఏవో, సౌత్ కో-ఆపరేషన్, సేంద్రియ, విత్తన ధృవీకరణ సంస్థ ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి హాజరయ్యారు. ఈ సదస్సులో హోం మంత్రి మహమూద్ అలీ, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. 70 దేశాల నుంచి 400 మంది, దేశియంగా 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఓఈసీడీ ప్రమాణాలకు అనుగుణంగా విత్తనోత్పత్తి, నాణ్యత నియంత్రణపై చర్చ సాగనుంది. మార్కెటింగ్, విదేశి ఎగుమతుల వంటి అంశాలపై సదస్సులో మాట్లాడనున్నారు. దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో విత్తనోత్పత్తి అంశలపై కూడా విస్తృత చర్చ జరుపనున్నారు.
హైదరాబాద్‌లో ఇష్టా కాంగ్రెస్-2019 సదస్సు - niranjan reddy
హైదరాబాద్ హెచ్ఐసీసీ నోవాటెల్‌లో ఇష్టా కాంగ్రెస్-2019 సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర వ్యవసాయశాఖ సహయ మంత్రి కైలాశ్ చౌదరి హాజరయ్యారు. మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో ఇష్టా కాంగ్రెస్-2019 సదస్సు