రాష్ట్రంలో సినిమా, టీవీ చిత్రీకరణలకు అనుమతులిస్తూ.... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 22 అంశాలతో సినిమా చిత్రీకరణల మార్గదర్శకాలను విడుదల చేసింది. పని ప్రదేశాల్లో పొగ తాగడం, గుట్కా నిషేధించాలని పేర్కొంది. షూటింగ్‌కు ముందు సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలన్న సర్కారు... మెడికల్ క్లియరెన్స్ లేనిదే పదేళ్లలోపు, 60 ఏళ్లు దాటిన వారిని అనుమతించరాదని స్పష్టం చేసింది.
40 మందితోనే..
40 మందితోనే సినిమా షూటింగ్ జరుపుకోవాలని తెలిపింది. చాలా వరకు షూటింగ్స్ ఇండోర్‌లోనే ఉండేలా చూసుకోవాలని వివరించింది. సాధ్యమైనంత వరకు బయట షూటింగ్స్ తగ్గించాలని, కంటైన్మెంట్ జోన్లలో షూటింగ్ అనుమతి లేదని తెలిపింది. నటీనటులు వాళ్ల ఆహారం, నీళ్లు ఇళ్ల నుంచే తెచ్చుకోవాలని... నటీనటుల వ్యక్తిగత మేకప్ కిట్స్ ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: ఆ సినిమాలో వర్షం సీన్ల కోసం ఆరేళ్లు షూటింగ్!