మహాత్మగాంధీ 150వ జయంతి వేడుకలు జరుగుతున్న సమయంలో రక్షణ, పోస్టల్ అధికారుల మధ్య 25 పరస్పర సహకారానికి గుర్తుగా పోస్టర్ కవర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని కంట్రోలర్ ఆఫ్ జనరల్ డిఫెన్స్ అకాడమీ సంజీవ్ మిట్టల్ అన్నారు. సికింద్రాబాద్ లోని కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకాడమీ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత పోస్టల్ అధికారి రాజేంద్ర కుమార్ (సిఎంపీజి)తో కలిసి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆర్మీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఇక్కడి నుంచే జరుగుతుంటాయని మిట్టల్ పేర్కొన్నారు. ఈ పోస్టల్ కవర్ విడుదల వలన దేశవ్యాప్తంగా కార్యాలయం చిరునామా తెలుసుకోవడం సులభమౌతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు సహకరించిన పోస్టర్ శాఖ అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకాడమీ వెంకట్ రావు, ఐడిఏఎస్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
రక్షణ, పోస్టల్ శాఖల పరస్పర సహకారానికి ప్రత్యేక స్టాంపు - సికింద్రాబాద్‌లో ప్రత్యేక పోస్టల్ స్టాంపు విడుదల
కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ సికింద్రాబాద్ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అధికారులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిఫెన్స్ అధికారులు, భారత పోస్టల్ అధికారుల పరస్పర సహకారానికి గుర్తుగా ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఇరు శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రక్షణ, పోస్టల్ శాఖల పరస్పర సహాకారానికి ప్రత్యేక స్టాంపు