హైదరాబాద్ ఇస్కాన్ దేవాలయంలో రథసప్తమి పురస్కరించుకుని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. భజనలు, కోలాటాలు, డప్పు చప్పులతో రథయాత్ర నిర్వహించారు. ఇస్కాన్ టెంపుల్ నుంచి హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, మోండా మార్కెట్ మీదుగా సాగింది. రకరకాల పూలతో జగన్నాథ స్వామి వారిని అలంకరించి ఊరేగించారు. ఆలయంలో ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నాయి. ఇస్కాన్ టెంపుల్ వారితో పాటు పెద్ద ఎత్తున భక్తులు పూజలో పాల్గొన్నారు.. రథానికి ఇరువైపులా హరినామస్మరణ చేస్తూ ముందుకు సాగారు.
వైభవంగా సాగిన జగన్నాథుని రథయాత్ర - Iskon_Temple_Radhayatra
హైదరాబాద్లో జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి రథాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. ఈకార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా సాగిన జగన్నాథుని రథయాత్ర