తెలంగాణ

telangana

'రాష్టంలో ఒక విద్యా విధానముందా'

By

Published : Nov 17, 2019, 7:44 AM IST

రాష్ట్రంలో కొనసాగుతున్న విద్యా విధానంపై భాజపా సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రానికి ఒక విద్యా విధానమంటూ ఉందా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

'రాష్టంలో ఒక విద్యా విధానముందా'

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ జరగలేదని భాజపా సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఒక విద్యా విధానమంటూ ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్ల నుంచి నవంబర్ 14న జరుగుతున్న ఫిల్మ్‌ ఫెస్టివల్ సైతం జరుపలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.

పాఠశాలల్లో తనిఖీ అధికారులు లేరని, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో ప్రైవేటు లెక్చరర్లు మాత్రమే ఉన్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.

ఇదీ చూడండి : పబ్బుకి వెళ్లారు... మద్యం తాగారు... క్రేన్​ను ఢీకొట్టారు...

ABOUT THE AUTHOR

...view details