ఐఎస్ సదన్ డివిజన్లో తెరాస అభ్యర్థి స్వప్న సుందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తనకు కార్పొరేటర్‌గా మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో కార్పొరేటర్‌గా గెలిపించిన డివిజన్ ప్రజలకు హామీలు ఇవ్వని పనులను కూడా చేసినట్లు తెలిపారు.
100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం: స్వప్న సుందర్ రెడ్డి - జీహెచ్ఎంసీ ఎన్నికల లేటెస్ట్ వార్తలు
తనకు కార్పొరేటర్‌గా మరోసారి అవకాశం ఇవ్వాలని ఐఎస్ సదన్ డివిజన్ తెరాస అభ్యర్థి స్వప్న సుందర్ రెడ్డి ప్రజలను కోరారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.
100 కోట్ల అభివృద్ధి పనులే చేపట్టాం: స్వప్న సుందర్ రెడ్డి
సుమారు వంద కోట్ల అభివృద్ది పనులను చేపట్టి.. ప్రజల మన్ననలు పొందినట్లు స్వప్నసుందర్ రెడ్డి పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలన్ని తెరాస వెన్నంటే ఉన్నాయని ఆమె వివరించారు.
ఇదీ చదవండి:ఆరేళ్లలో భాజపా తెలంగాణకు చేసింది సున్నా : కేటీఆర్