తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉస్మానియా ఆసుపత్రి సురక్షితమేనా? - hospital

"రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైతే ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యం చేయించగలరా? అసలు ఈ ఆసుపత్రి సురక్షితమేనా?" హైకోర్టు

ఉస్మానియా ఆసుపత్రి సురక్షితమేనా?

By

Published : Jul 24, 2019, 11:29 PM IST

ఉస్మానియా ఆసుపత్రి సురక్షితమేనా?

ఉస్మానియా ఆసుపత్రి సురక్షితమేనా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన నివేదికలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉస్మానియా ఆసుపత్రికి తాను ఓ సారి వెళ్లానని... అక్కడ సరైన పరిశుభ్రత లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైతే ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యం చేయించగలరా అని ధర్మాసనం ప్రశ్నించింది.

విచారణ..

కూలిపోయే స్థితిలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనం స్థానంలో ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, వసతి గృహంతో కలిసి బహుళ అంతస్తుల భవనం నిర్మించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హెల్త్ కేర్ రిఫారమ్స్ అనే సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది.

అసంతృప్తి..

రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు రమేశ్​రెడ్డి దాఖలు చేసిన కౌంటరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 30 వేల చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపడుతున్నట్టు పేర్కొనడం వల్ల దానికి సంబంధించి పూర్తి ప్రణాళిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇవీ చూడండి: రామన్నకు... చిరునవ్వుతో ఓ కానుక

ABOUT THE AUTHOR

...view details