గులాబ్ తుపాను దెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తిన పరిస్థితులను ఏఈఈ స్థాయి ఇంజినీర్లతో నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులను ఆరా తీశారు. రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో... ఇంజినీర్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలని రజత్ కుమార్ సూచించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఇంజినీర్లకు ఉన్న ఆర్థికాధికారాలను వినియోగించుకోవాలని తెలిపారు.
నీటిపారుదలకు సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే ప్రజలు వెంటనే కంట్రోల్ రూం నంబర్ 040-23390794 కు ఫోన్ చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కోరారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని... ఎక్కడా పెద్దగా సమస్యలు ఉత్పన్నం కాలేదని చీఫ్ ఇంజనీర్లు తెలిపారు. కొన్ని చోట్ల చెరువులకు పడిన గండ్లను వెంటనే పూడ్చివేశామని పేర్కొన్నారు.
హైదరాబాద్ పరిధిలో 15 ప్రత్యేక బృందాలు