ఇరిగేషన్ శాఖలో నకిలీ జీవోలు సృష్టించి లక్షలు స్వాహా చేసినట్లు ఆ శాఖ ఉప కార్యదర్శి హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 88 లక్షలు మంజూరు అయినట్లు.. అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారన్నారు. ఆర్థిక శాఖ అనుమతి తీసుకొని ఖజానా నుంచి నగదు బదిలీ చేసుకున్నారని తెలిపారు. సాగునీటి శాఖ ఉన్నతాధికారులు జీవోలను పరిశీలిస్తున్న క్రమంలో ఈ వ్యవహారం వెలుగు చూసిందని పేర్కొన్నారు. అంతర్గతంగా విచారించగా... గుర్తు తెలియని వ్యక్తులు ఈ నేరానికి పాల్పడ్డారని తెలుసుకున్నారు. వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని సీసీఎస్ పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇరిగేషన్లో అక్రమాలు.. సీసీఎస్‌లో ఫిర్యాదు
ఇరిగేషన్ శాఖలో జరిగిన అక్రమాలపై ఆ శాఖ ఉపకార్యదర్శి సుబ్బయ్య.. హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 8 లక్షలు స్వాహా చేసేందుకు పథకం రచించి... నకిలీ జీవోలు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సీసీఎస్