హైదరాబాద్లోని గోల్నాక డివిజన్లోని హిందూ శ్మశాన వాటికలో ఆఫీసు వర్కర్లు, దళారులు అందినకాడికి దోచుకుంటున్నారని గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. గోల్నాకలోని శ్మశాన వాటిక వద్ద పరిస్థితులను సమీక్షించారు. సిబ్బంది చేతివాటం, దళారుల అడ్డగోలు వసూళ్లను గ్రేవ్ యార్డ్ ఇంఛార్జీ దృష్టికి తీసుకెళ్లారు.
సాక్ష్యాలతో…
శ్మశాన వాటికలో ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కంటే అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు కార్పొరేటర్ తెలిపారు. కరోనా కష్టకాలంలో ఇంట్లో మనిషిని కోల్పోయి దుఃఖంలో ఉన్న వారితో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని బాధితులు తమకు చెప్పారని అన్నారు. డొనేషన్ కింద రూ.2800 నుంచి రూ.3500 వరకు తీసుకుంటున్నారని ఆరోపించారు.