హైదరాబాద్ మౌలాలిలో భారతీయ రైల్వే ఆర్థిక నిర్వహణ సంస్థ అయిన ఇండియన్ రైల్వేస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌ను రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. రైల్వేశాఖ మౌలాలీలోని డిజిల్ లోకోషెడ్ ఎదురుగా ఇరిఫెంను ఏర్పాటు చేసింది.
'మానవ వనరుల అభివృద్ధి కోసమే ఇరిఫెం' - Irifm Inauguration by Railway Charmin Vinod kumar Yadav
రైల్వే ఉద్యోగులకు సాంకేతిక నైపుణ్యాలను అందించటమే లక్ష్యంగా రైల్వే సంస్థ ఆధ్వర్యంలో ఇండియన్ రైల్వేస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌ను హైదరాబాద్ మౌలాలిలో నెలకొల్పారు. దీనిని ఇవాళ రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. మానవ వనరుల అభివృద్ధి కోసం దీనిని నెలకొల్పినట్లు ఆయన తెలిపారు.

మానవ వనరుల అభివృద్ధి కోసమే ఇరిఫెం
ఆర్థికపరమైన విషయాలు, గణాంకాల పద్ధతుల్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో సాంకేతిక నైపుణ్యాలను ఉద్యోగులకు అందించేందుకు రైల్వేశాఖ ఈ సంస్థను ఏర్పాటు చేసింది. ఆర్థికపరమైన అంశాల్లో సూపర్‌వైజర్ నుంచి ఐఆర్‌టీఎస్ స్థాయి అధికారుల వరకు ఈ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా, రైల్వే బోర్డు ఫైనాన్షియల్ కమిషనర్ మంజులా రంగరాజన్ తదితరులు పాల్గొన్నారు.
మానవ వనరుల అభివృద్ధి కోసమే ఇరిఫెం