తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ కమిషనరేట్​ను సందర్శించిన సీనియర్ ఐపీఎస్​లు - సర్దార్ వల్లాభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ

సర్దార్ వల్లాభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 22 రాష్ట్రాలకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు హైదరాబాద్ కమిషనరేట్​ను సందర్శించారు. ఇక్కడ అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్​ విధానం గురించి తెలుసుకున్నారు.

హైదరాబాద్​ కమిషనరేట్

By

Published : Jul 24, 2019, 10:08 PM IST

హైదరాబాద్​లోని సర్దార్ వల్లభాయ్ పటేల్​ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సీనియర్ ఐపీఎస్ అధికారులు నగర కమిషనరేట్​ను సందర్శించారు. 22 రాష్ట్రాలకు చెందిన ఐజీ, డీఐజీ స్థాయి ఉన్నతాధికారులు ఇందులో ఉన్నారు. వీళ్లంతా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్న సాంకేతికత, ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. వాహనాల రద్దీని నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యల గురించి ట్రాఫిక్ పోలీసులు వివరించారు. నగర పరిధిలో మహిళల భద్రత కోసం చేపట్టిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీపీ అంజనీ కుమార్, అదనపు డీజీ షికా గోయల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కమిషనరేట్​ను సందర్శించిన సీనియర్ ఐపీఎస్​లు

ABOUT THE AUTHOR

...view details