IPS Officers Transfers in Telangana Today :హైదరాబాద్ పోలీస్ కమిషనర్(Hyderabad CP)గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బదిలీ అయ్యారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో ఆర్గనైజేషన్, లీగల్ విభాగం అదనపు డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు పదేళ్లుగా అప్రాధాన్య పోస్టులో ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి కీలకమైన హైదరాబాద్ సీపీ పోస్టు దక్కింది. ముక్కుసూటిగా, నిజాయతీగా వ్యవహరిస్తారనే పేరున్న శ్రీనివాస్ రెడ్డి(Hyderabad CP Srinivas Reddy), ఎక్కువ కాలం ఏ పోస్టులోనూ పని చేయలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన స్థానానికి బదిలీ అయ్యారు.
ప్రస్తుత హైదరాబాద్ సీపీసందీప్ శాండిల్లను టీఎస్ న్యాబ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. సైబరాబాద్ సీపీగా అవినాశ్ మహంతి బదిలీ అయ్యారు. ఆ స్థానంలో ఉన్న స్టీఫెన్ రవీంద్రను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. రాచకొండ సీపీగా సుధీర్ బాబు బదిలీ అయ్యారు. ప్రస్తుతం సుధీర్ బాబు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు సీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాచకొండ సీపీగా ఉన్న డీఎస్ చౌహాన్‌ను డీజీపీ కార్యాలయానికి బదిలీపై పంపించారు.
EC Transfers Several Collectors and SPs in Telangana : హైదరాబాద్ సీపీ సహా పలువురు కలెక్టర్లు, ఎస్పీల బదిలీకి ఈసీ ఆదేశం
గతంలో హైదరాబాద్ సీపీగా ఉన్న ఆనంద్‌ను బదిలీ చేసిన ఈసీ : డిసెంబరు 3వ తేదీన తెలంగాణ శాసనసభ ఎన్నికల దృష్ట్యా కొందరు జిల్లా కలెక్టర్లను, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ సీపీగా ఉన్న సీపీ ఆనంద్‌ను సైతం గత ఫిర్యాదుల ఆధారంగా వేరే చోటుకు బదిలీ చేశారు. డబ్బు, మద్యం, ఇతరత్రా పంపిణీ, మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ బదిలీలను కేంద్ర ఎన్నికల సంఘం చేసింది.
గత ప్రభుత్వంలో హైదరాబాద్ సీపీగా పని చేసిన ఆనంద్, ప్రస్తుతం బదిలీలో ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. మళ్లీ హైదరాబాద్ సీపీగా ఆనంద్ వస్తారనే అంచనాలకు ఫుల్ స్టాప్ పడింది. అలాగే కౌంటింగ్ రోజు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ను కూడా ఈసీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు మళ్లీ ఆ సస్పెండ్‌ను రద్దు చేసింది.
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా - ఆమోదించని గవర్నర్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ భూతం - అధికారులు చలానాలకే పరిమితం - వాహనదారులకు తప్పని నరకం