హైదరాబాద్ సర్ధార్ వల్లభ్‌బాయిపటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 74వ బ్యాచ్‌శిక్షణ విజయవంతంగా పూర్తైంది. కరోనా కారణంగా అక్టోబర్‌లో పూర్తి కావాల్సిన ట్రైనింగ్... నాలుగు నెలలు ఆలస్యమైంది. 74వ బ్యాచ్‌లో మొత్తం 195 మంది శిక్షణ తీసుకోగా... వారిలో 41 మంది మహిళలు ఉన్నారు. గతంతో పోలిస్తే మహిళా ఐపీఎస్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 195 మందిలో166 మంది ఐపీఎస్‌లు కాగా మిగిలిన 29 మంది విదేశీక్యాడెట్లు. విదేశీయుల్లో నేపాల్, భూటాన్, మాల్‌దీవులు, మారిషస్ దేశాల క్యాడెట్లు శిక్షణ పొందా రు. ఐపీఎస్‌లలో ఎక్కువగా ఇంజనీరింగ్ చేసిన వారే అధికంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్న 166 మందిలో ఇంజినీరింగ్ చదివినవారే 114 మంది ఉన్నారు.
కరోనా వల్ల 74వ బ్యాచ్ ఆలస్యం కావడంతో ఈసారి 75వ బ్యాచ్‌కి అకాడమీలో శిక్షణ సాగుతోంది. ప్రస్తుతం అకాడమీలో సుమారు 400 మంది క్యాడెట్లు ఉన్నారు. అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన కేరళకి చెందిన కేఎస్ షెహన్‌షా... పాసింగ్ అవుట్ పరేడ్ మాండర్‌గా వ్యవహరించనున్నారు. షెహన్‌షా సివిల్స్‌లో ఆరు ప్రయత్నాల్లో విఫలమైనా... ఏడో ప్రయత్నంలో 142వ ర్యాంకు సాధించారు. ఐఏఎస్ దక్కే అవకాశమున్నా పోలీస్ ఉద్యోగంపై ఇష్టంతో ఐపీఎస్ ఎంచుకున్నారు.