పెళ్లిపత్రికలు రకరకాలుగా రూపొందిస్తుంటారు. కొందరు విభిన్నంగా ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో రైల్వేశాఖ ఉన్నతాధికారి శశికాంత్ మరికాస్త వైవిధ్యంగా ఆలోచించారు. పర్యావరణహితం, పచ్చదనాన్ని దృష్టిలో ఉంచుకొని తన వివాహానికి విత్తనాలు పొదిగిన ఆహ్వానపత్రికను తయారు చేయించారు. కూరగాయల విత్తనాలను అందులో పొందుపరిచారు. ఈ పత్రికను నాటండని కోరుతూ... ప్రేమను సాగు చేయండని విజ్ఞప్తి చేశారు.
విత్తనాలు పొదిగిన పెళ్లి పత్రిక.. కేసీఆర్‌కి ఆహ్వానం!
పెళ్లికి ముహూర్తం ఎంత ముఖ్యమో.. దానికి సంబంధించిన పత్రికలు అంతే ముఖ్యంగా, ఆకర్షణీయంగా ఉండాలని ఆలోచిస్తుంది నేటి యువత. సాంకేతిక పెరుగుతున్న కొద్దీ దానిని వినియోగించుకుంటూ సరికొత్తగా, వినూత్నంగా పత్రికలు అచ్చు వేయించుకుంటున్నారు. అలాంటి కొన్ని పత్రికలని ఈ మధ్య కాలంలో చూశాం. తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగి తన వివాహానికి పర్యావరణ హితం సందేశాన్ని పంపుతూ పత్రిక అచ్చు వేయించారు. అదేంటో చూద్దాం.
విత్తనాలు పొదిగిన పెళ్లి పత్రిక.. కేసీఆర్‌కి ఆహ్వానం!
తన వివాహానికి రావాలని కోరుతూ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కి శశికాంత్ ఆహ్వానపత్రికను అందించారు.
ఇదీ చదవండి:'ఓట్లు, సీట్ల కోసం మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారు'