Investment Fraud Case Update : పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మరో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ముంబయికి చెందిన అమన్ థాపా అనే నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు ప్రకాష్ ప్రజాపతికి అమన్ థాపా సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను గత నెల హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 15వేల మంది నుంచి రూ.712కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మోసం వెనుక చైనీయులున్నట్లు దర్యాప్తులో తేలింది.
Starting of Investment Fraud Case: హైదరాబాద్‌లోని చిక్కడ్ పల్లికి చెందిన శివకుమార్‌కు టెలిగ్రామ్ యాప్‌లో ఈ ఏడాది మార్చిలో ఓ సందేశం వచ్చింది. పెట్టుబడి పెడితే అధిక లాభాలిస్తామంటూ సందేశం పంపించడంతో నిజమని నమ్మి విడతల వారీగా నిందితులు సూచించిన విధంగా రూ.6.28 లక్షలు జమ చేశాడు. నిందితులు సూచించి యాప్‌లో డబ్బులు కనిపిస్తున్నా.. వాటిని విత్ డ్రా చేస్తే రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి.. నిందుతుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు జమ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నగరానికి చెందిన నలుగురు యువకుల లక్నోలో డొల్ల కంపెనీలు ప్రారంభించించి వాటి ద్వారా 33 బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు తేల్చారు. వాటిలోని 6 ఖాతాల్లో శివకుమార్ రూ.28లక్షలు బదిలీ చేసినట్లు తేల్చారు. అహ్మదాబాద్‌కు చెందిన ప్రకాష్ ప్రజాపతి సూచనతో డొల్ల కంపెనీలు, బ్యాంకు ఖాతాలు తెరిచి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ప్రకాష్ ప్రజాపతి వెనక ముగ్గురు చైనీయులున్నట్లు(China) గుర్తించారు. గతంలోనూ ప్రకాష్ ప్రజాపతిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఓ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై విడుదలైన ప్రకాష్ మరోసారి చైనీయులతో కలిసి రూ.712కోట్ల వసూలు చేశాడు.
investment Fraud gang Arrested: పెట్టుబడుల పేరుతో చైనీయుల మోసాలు.. వారంలోనే రూ.2.42 కోట్లు!