రౌడీ షీటర్ నరసింహదాసు గౌడ్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హైదరాబాద్ బోరబండ శివాజీనగర్‌లో నరసింహదాసు గౌడ్‌ను హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడిపై వివిధ పోలీసు స్టేషన్లల్లో పలు కేసులు నమోదైనట్లు గుర్తించారు. కేసు సీరియస్‌గా తీసుకున్న డీసీపీ పద్మజా స్వయంగా రంగంలోకి దిగి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. నరసింహదాసు గౌడ్‌పై పహాడీ షరీఫ్ ఠాణాలో రౌడీ షీట్ ఉన్నట్లుగా డీసీపీ తెలిపారు. ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్‌లోనూ ఒక హత్య కేసుతోపాటు 13కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు.
రౌడీషీటర్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం - dcp
హైదరాబాద్ బోరబండ శివాజీనగర్‌లో గత రాత్రి జరిగిన రౌడీషీటర్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. స్వయంగా డీసీపీ పద్మజ రంగంలోకి దిగి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.
హత్య జరిగిన ప్రదేశం