తెలంగాణ

telangana

ETV Bharat / state

అబ్దుల్ కలీమ్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి

Hyderabad police investigates Abdul Kalim : హైదరాబాద్‌లో గతేడాది దసరా పండుగ రోజు మారణహోమం సృష్టించేందుకు పన్నిన ఉగ్రకుట్రను గతేడాదే పోలీసులు భగ్నం చేశారు. ఇదే కేసులో గురువారం అరెస్టైన ముసారాంబాగ్‌కు చెందిన అబ్దుల్‌ కలీమ్‌ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Abdul Kaleem
అబ్దుల్‌ కలీం

By

Published : Feb 18, 2023, 7:33 AM IST

అబ్దుల్‌ కలీం

Hyderabad police investigates Abdul Kalim : పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్షంగా సంబంధాలు ఏర్పరుచుకొని ఉగ్రకుట్రకు యత్నించిన కేసులో ముసారాంబాగ్‌కు చెందిన అబ్దుల్‌ కలీమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో ఉగ్రదాడులు చేసేందుకు అబ్దుల్‌ సాయం అందించినట్లు లష్కరే తోయిబా సంస్థ సభ్యులతో మంతనాలు సాగించినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

Key Information about Abdul Kalim : నగరంలోని యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు అబ్దుల్‌ జావీద్‌, సమీయుద్దీన్, హసన్‌ ఫరూక్‌లను కూడా అబ్దుల్‌ కలీమ్‌ రంగంలోకి దింపాడు. దీని కోసం ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్‌ నుంచి హవాలా మార్గంలో అబ్దుల్‌ కలీమ్‌కు 40 లక్షల నగదు కూడా పంపారు. గతేడాది దసరా రోజున భాజపా, ఆర్​ఎస్​ఎస్​ నేతలను లక్ష్యంగా చేసుకొని మారణహోమం సృష్టించేందుకు పథక రచన చేశారు. ముందుగానే పోలీసులు అప్రమత్తం కావడంతో వారి ఉగ్రకుట్నను భగ్నం చేశారు.

Hyderabad terror attack conspiracy case : గతంలో అబ్దుల్‌ కలీమ్‌ ముసారాంబాగ్‌లో వెల్డింగ్‌ పని చేస్తుండేవాడు. 2005లో బేగంపేట్‌ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై బంగ్లాదేశ్‌కు చెందిన డాలీ అనే తీవ్రవాది ఆత్మహుతి దాడి పాల్పడ్డాడు. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో అబ్దుల్‌ కలీం, అబ్దుల్‌ జావీద్‌ కూడా ఉన్నారు. ఆ తర్వాత వీళ్లు 2017లో బేయిల్‌పై విడుదలయ్యారు. బయటకు వచ్చినప్పటికీ ఉగ్రవాద సంస్థలతో మళ్లీ మంతనాలు సాగిస్తూనే ఉన్నారు.

ఉగ్రకేసులో వీరు విడుదలైనప్పటికీ పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచి వీరి వివరాలు సేకరిస్తూ వచ్చారు. పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చి ఉగ్రకుట్నను భగ్నం చేశారు. పక్కా ఆధారాలతో మలక్‌పేట్, ముసారాంబాగ్‌,ఆసిఫ్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి నిందితులను అరెస్టు చేశారు. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు సహకరించినట్లు భావిస్తున్న మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిలో ఉన్నత విద్యావంతురాలైన మహిళ కూడా ఉన్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details