తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు... విచారణకు సంతోష్‌ సహకరించడం లేదని హైకోర్టుకు తెలిపిన సిట్‌ - hyderabad latest news

TRS MLAs Poaching Case Update: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్​ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. విచారణకు బీఎల్ సంతోష్ సహకరించడం లేదని సిట్ అధికారులు హైకోర్టుకు తెలిపారు. మరోవైపు సిట్ దర్యాప్తు ఆపాలని నిందితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.

Investigation in the TS High Court in the case of baiting MLAs
ఎమ్మెల్యేలకు ఎర కేసు... సంతోష్‌ సహకరించడం లేదని హైకోర్టుకు తెలిపిన సిట్‌

By

Published : Nov 22, 2022, 5:18 PM IST

Updated : Nov 22, 2022, 6:17 PM IST

TRS MLAs Poaching Case Update: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్​ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బీఎల్ సంతోశ్​ విచారణకు సహకరించకపోవడంతో దిల్లీ పోలీసుల ద్వారా సిట్ అధికారులు అందజేశారు. బి.ఎల్‌.సంతోష్‌ విచారణకు సహకరించడం లేదని సిట్‌ హైకోర్టుకు తెలిపింది. దాంతో న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే సిట్ దర్యాప్తు ఆపాలని నిందితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముగ్గురు నిందితులు సిట్ దర్యాప్తు నిలిపివేయాలంటూ పిటిషన్ వేశారు.

అలాగే మరో వైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై అ.ని.శా. కోర్టులో విచారణ కొనసాగుతోంది. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు అ.ని.శా. కోర్టులో పిటిషన్ వేశారు. నిందితుల తరఫున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. అ.ని.శా. ప్రత్యేక కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

మరోవైపు నిన్న శ్రీనివాస్​ను సిట్ అధికారులు దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. సింహయాజీతో ఉన్న సంబంధాలపై సేకరించిన ఆధారాలను ముందు పెట్టుకొని మరీ ప్రశ్నించారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఫామ్​హౌస్​లో జరిగిన సంప్రదింపులపై తనకు ఏమాత్రం అవగాహన లేదని శ్రీనివాస్ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నందకుమార్​తోనూ శ్రీనివాస్​కు సత్సంబంధాలే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే న్యాయవాది శ్రీనివాస్​ నేడు మరోసారి సిట్​ ఎదుట హాజరయ్యారు. సిట్ అధికారులు అడిగిన వివరాలతో విచారణకు హాజరయ్యారు.

ఇవీ చూడండి..

Last Updated : Nov 22, 2022, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details