తెలంగాణ

telangana

ETV Bharat / state

నది మాయం... రొయ్యల చెరువు ప్రత్యక్షం..! - latest updates of vamsadhara river

వంశధార... శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన నది. వేల ఎకరాలకు సాగు, వందల గ్రామాలకు తాగునీరు అందించే ఈ నది అన్యాక్రాంతమవుతోంది. 2 గ్రామాల మధ్య నదిని పాయలుగా విభజించి... రొయ్యల చెరువులుగా మార్చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు... అక్రమణలు తొలగించే చర్యలు చేపట్టారు.

నది మాయం...

By

Published : Oct 23, 2019, 10:16 PM IST

శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన నది వంశధార... ఇప్పుడు ఆక్రమణకు గురవుతోంది. పోలాకి మండలం రేవు అంపలాం, గార మండలం కళింగపట్నం గ్రామాల మధ్య... వంశధార నదిని పాయలుగా విభజించారు. రొయ్యల చెరువులుగా మార్చేశారు. వంశధార నది స్థలం ఆక్రమణకు గురైందని అధికారులు నిర్ధరించుకున్నారు. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్... సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

నీటిపారుదల శాఖ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ రౌతు సత్యనారాయణ ఆధ్వర్యంలో... త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ... రేవు అంపలాం, కళింగపట్నం గ్రామాల మధ్య ఆక్రమణలకు గురైన నది ప్రాంతాన్ని పరిశీలించింది. సర్వే నెంబర్ 516లో 25 ఎకరాలు కబ్జాకు గురైనట్లు నిర్ధరించింది. నీటిపారుదల శాఖ అధికారులు ఆక్రమణలు తొలగించే ప్రక్రియ చేపట్టారు.

నది మాయం...

ఇదీ చదవండి: బోటు వెలికితీతతో ముగిసిన పాపికొండల విషాదయాత్ర

ABOUT THE AUTHOR

...view details